అనంతపురం జిల్లా ఉరవకొండ బైపాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి సఫారీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లెకి చెందిన నలుగురు వ్యక్తులు కర్ణాటక గుట్కాను సఫారీ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు గుంతకల్లు డీఎస్పీ తెలిపారు. 80 వేల విలువైన (బహిరంగ మార్కెట్లో వీటి విలువ లక్షా 50 వేలు) గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కాసిం సాహెబ్ తెలిపారు.
ఇదీ చదవండి 'అక్రమ మద్యం, ఇసుక రవాణాపై కఠిన చర్యలు'
ఉరవకొండలో నిషేధిత గుట్కా పట్టివేత..నలుగురు అరెస్టు - నిషేధిత గుట్కా పట్టివేత..నలుగురు అరెస్టు
అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.