అనంతపురం జిల్లా గుడిబండ మండల బాలికల గురుకుల పాఠశాలలో... మూడేళ్లుగా పొరుగు సేవల పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురిని తొలగించారు. వీరు గత ప్రభుత్వ హయాంలో ఎంపికయ్యారు. పొరుగు సేవల ఉద్యోగులను తొలగించబోమని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా... అధికారులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. జీవనాధారం లేక రోడ్డున పడ్డామంటూ... ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేదంటే ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి :