ETV Bharat / state

విమానాశ్రయం లాంటి హంగులతో గుంతకల్ రైల్వే స్టేషన్‌ - గుంతకల్ రైల్వే స్టేషన్

రైలు ప్రయాణం అంటేనే... గజిబిజిగా ఉండే స్టేషన్, గందరగోళ వాతావరణం, అసౌకర్యంగా ఉండే ఫ్లాట్‌ ఫామ్స్... ఇవన్నీ గతం. ఇపుడు భారత రైల్వే అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగ దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్‌ను.. తలమానికంగా తీర్చిదిద్దింది.

guntakal railway station development
గుంతకల్ రైల్వే స్టేషన్‌
author img

By

Published : Feb 26, 2021, 7:59 AM IST

Updated : Feb 26, 2021, 2:22 PM IST

దక్షిణ భారత రైల్వే సరికొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని హంగులతో ఆధునాతనంగా విస్తరిస్తూ.. ప్రయాణికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అలాంటి కోవకు చెందినదే అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్.

గుంతకల్ రైల్వే స్టేషన్‌

ఈ దృశ్యాలు ఏదైనా అంతర్జాతీయ విమానాశ్రయం అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే ఇది గుంతకల్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన దృశ్యాలు. దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గుంతకల్ రైల్వే స్టేషన్‌ను..ఈ జోన్‌లోనే తలమానికంగా తీర్చిదిద్దారు. సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని హంగులతో ఆధునీకరించారు.

ఆధునాతన హంగులు

రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే అద్దాలను తలపించే ప్లాట్ ఫామ్‌లు, వృద్ధులకోసం ఎస్కలేటర్,ప్రతి ప్లాట్ పామ్‌లో వైఫై సౌకర్యాలు, చరిత్ర వైభవం తెలిపే పెయింటింగ్స్, స్టేషన్ బయట ఫ్రీ ఎయిర్ థియేటర్, అత్యాధునిక లైటింగ్, పార్క్‌లతో తీర్చిదిద్దారు.

రైల్వేస్టేషన్ ఆధునికీకరణ

రైల్వేస్టేషన్ ఆధునికీకరణలో భాగంగా.. కొత్త ఫ్లాట్‌ ఫాం, ఎస్క్యులేటర్ ఇతర పనుల కోసం రూ. 25 కోట్ల నుంచి 30కోట్లు ఖర్చు చేశాం. ఇది రైల్వేస్టేషన్‌లా కాకుండా.. విమానాశ్రయంలాగా కనిపిస్తుంది. అత్యంత ఆధునికీకరించిన రైల్వేస్టేషన్‌లా స్పష్టమవుతుంది.

విహారయాత్రలా ఉంది

పిల్లలు, పెద్దలు ఒక విహార యాత్రకు వచ్చినట్లుగా ఇక్కడకు వస్తున్నారు. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు.

విమానాశ్రయం లాగానే..!

గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉన్నంత సేపు విమానశ్రయంలో ఉన్నంత సంతోషంగా ఉంటుందని ఇక్కడకు వచ్చే ప్రజలు చెబుతున్నారు.

ఇదీ చూడండి. 'ఉక్కు' విక్రయానికి చర్యలు మొదలు.. పర్యవేక్షణ సలహాదారుల ఎంపిక!

Last Updated : Feb 26, 2021, 2:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.