రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ లో రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాత్రిపూట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీలింగ్ ఎత్తివేయాలని, నూతన పింఛన్ విధానం రద్దు చేయాలని నినాదాలు చేశారు. రన్నింగ్ సిబ్బందికి కిలోమీటర్లు తగ్గించడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కదిరిలో 'యూనిటీ రన్' కార్యక్రమం