అనంతపురం జిల్లా రొద్దం మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించే 11మంది హరిత రాయబార పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆరు నెలలుగా వేతనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం తలుపులు మూసేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఐటీయూ నాయకులు, స్వచ్ఛభారత్ కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేశారు. కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అర్హులైన వారందరికీ ఇంటి స్థలం: ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి