అనంతపురం జిల్లా రొద్దం ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. గ్రామసచివాలయ పరిపాలన బాధ్యతలను గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటంపై నిరసన వ్యక్తం చేశారు. వెంటేనే జీవో ఎంఎస్2ను నిలుపుదల చేయాలని ప్లకార్డులతో డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పునః సమీక్షించాలని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, పర్యవేక్షణ బాధ్యతను, సిబ్బందికి జీతభత్యాల చెల్లింపులను గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించడం 73వ రాజ్యాంగ సవరణ, పంచాయతీ రాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు కారణమైన జీవో ఎంఎస్ 110, 149కు వ్యతిరేకంగా ఉన్న జీవో ఎంఎస్ 2 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి