అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఓవైపు గోదావరికి వరదలు వచ్చి పంటలు నాశనమవుతుంటే అనంతలో మాత్రం నెలన్నర రోజులుగా చినుకు రాలక తొలకర్లకు వేసిన విత్తనం భూమిలోనే సమాధైపోయింది. అప్పలు చేసి విత్తనం, ఎరువులు కొనుగోలు చేసి పంట వేసిన రైతులు నష్టపోయారు. దింతో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి వర్షాభావ ప్రాంతాల్లో పంటభూములను పరిశీలిస్తున్నారు. ప్రత్యమ్నాయ పంటల విత్తనాల అవసరాలను తెలుసుకుంటున్నారు. త్వరలో రైతలకు విత్తనాలు అందజేస్తామన్నారు.
ఇదీచదవండి