ETV Bharat / state

గాయత్రిదేవి అలంకరణలో కనువిందు చేస్తున్న అమ్మవారు

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. కనకదుర్గ అమ్మవారు గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. జగజ్జననిగా సకల భక్తజనంతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. సర్వాలంకార శోభితురాలైన పంచముఖాలతో గాయత్రి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని వేకువజాము నుంచి భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

గాయత్రి దేవి అలంకరణలో కనువిందు చేస్తున్న అమ్మవారు
author img

By

Published : Oct 1, 2019, 9:03 PM IST

గాయత్రి దేవి అలంకరణలో కనువిందు చేస్తున్న అమ్మవారు

పశ్చిమగోదావరి జిల్లా
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గోస్తని తీరాన ఉన్న కనకదుర్గ అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులను కనువిందు చేస్తున్నారు. పంచముఖ రూప ధారిణి గాయత్రీదేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. నిత్యం బంగారు చీరతో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించడానికి, మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. సకల వేదాలకు.. శాస్త్రాలకు.. మంత్రాలకు అధిష్టాన దేవతగా సకల జ్ఞాన ప్రదాయినిగా గాయత్రీ అమ్మవారు పంచముఖాలతో భక్తులకు దర్శనమిచ్చారు.
అంబాజీపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 25 మంది మహిళలు ప్రత్యేక వేషధారణలో దాండియా నృత్యాలు, కోలాటాలు ఆడారు.

అనంతపురం జిల్లా
కదిరి కన్యకాపరమేశ్వరి మందిరంలో వాసవి మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదదేవి అలంకారంలో కొలువుతీరిన వాసవాంబ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సంఘ సభ్యులు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి అమ్మవారికి హారతి పట్టారు.

కృష్ణా జిల్లా
గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో కొండాలమ్మ తల్లి కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచి హోమాలు అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
నూజివీడు చరిత్రకు ఆనవాలుగా నిలిచిన శ్రీ కోట మహిషామర్ధిని అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు. సకల జనులు విజ్ఞాన అందించేందుకు సాక్షాత్తు జగన్మాత భూమికి దిగి వచ్చినట్లుగా పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్లుగా ఆలయ పూజారి తెలిపారు.
మోపిదేవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

నెల్లూరు జిల్లా
నెల్లూరు నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గాయత్రీ మాతగా భక్తులకు అభయమిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

గుంటూరు జిల్లా
పంచారామ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరాలయంలో దసరా ఉత్సవాలు 3 వ రోజు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బాలచాముండికా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.

ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు మంగళ గౌరి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురెష్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లా
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని లడ్డూలతో అలంకరించారు. అమ్మవారి సుందర రూపాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గ్రామ దేవత పాల పోలమ్మ తల్లికి దసరా నవరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వేకువజాము నుంచి క్షీరాభిషేకం.. పంచామృతాభిషేకం.. నారికేళ అభిషేకం చేశారు.
కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామంలోని కొత్తమ్మతల్లి ఆలయ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి: కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు..

Intro:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 17వ వార్డు లో కొలువై ఉన్న విశ్వ దుర్గేశ్వర అమ్మవారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వ దుర్గేశ్వర అమ్మవారిని 50 లక్షల రూపాయల కొత్త నోట్లతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోలాట నిత్య ప్రదర్శనలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ క్రతువులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Byte..గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి.Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 17వ వార్డు లో కొలువై ఉన్న విశ్వ దుర్గేశ్వర అమ్మవారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వ దుర్గేశ్వర అమ్మవారిని 50 లక్షల రూపాయల కొత్త నోట్లతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోలాట నిత్య ప్రదర్శనలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ క్రతువులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Byte..గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి.Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.