అనంతపురం జిల్లా వందో కలెక్టర్‌గా గంధం చంద్రుడు బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి దత్త మండల కేంద్రంగా ఉన్న అనంతకు తొలి కలెక్టర్‌గా థామస్ మన్రో విధులు నిర్వహించగా.. వందో కలెక్టర్‌గా ఇవాళ గంధం చంద్రుడికి ఆ ఘనత దక్కింది. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన.. కార్యాలయానికి వెళ్లే ముందు మెట్లకు నమస్కరించారు. తానో వందో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని గంధం చంద్రుడు అన్నారు. ప్రభుత్వ అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురం జిల్లాకు తన వంతుగా న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.
మొక్క నాటి ఫోటో వాట్సాప్ చేయండి
జిల్లాలో అధికారిక సమావేశాలను శాఖాధిపతులు ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అధికారులు ప్లాస్టిక్ రహిత పాలన అందించాలని కోరారు. తాను నిర్వహించే సమావేశాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు లేకుండా చూడాలని.. ఆ మేరకు అధికారులు తనకు హామీ ఇవ్వాలని చెప్పారు. ఇవాళ రాత్రి ఏడు గంటల లోపు ప్రతి అధికారు ఓ మొక్క నాటి.. దానితో కలిసి ఫోటో దిగి తన వాట్సాప్‌కు పంపాలని సూచించారు. నాటిన మొక్కను రెండేళ్ల తర్వాత మరోసారి ఫోటో తీసి నాడు-నేడులో ప్రచురిద్దామని అన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారు పువ్వుల బొకేలు తీసుకురావద్దని.. పాలనలో తనకు సహకరించి ఆశీస్సులు అందిస్తే చాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: