అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా వైరస్ బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కాలనీలలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఆ కాలనిలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అక్కడివారు బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ సోకినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇది చదవండి కరోనా సోకిందా? అయితే ఈ నగదు బహుమానం మీకే!