వేరుశెనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విత్తనాల కోసం సోమవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేయగా...ఈరోజూ కొన్ని కేంద్రాల్లో అదే పరిస్థితి కనిపించింది. మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల, అమరాపురం, మడకశిర మండల కేంద్రాల్లో విత్తన నిల్వలు నిండుకోవడం వల్ల పంపిణీ ఆగిపోయింది. ఇవాళ ఉదయాన్నే విత్తనాల కోసం వచ్చిన రైతులు.. ఎన్నిరోజులు ఇలా చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రొళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతన్నలు ఆందోళనకు దిగారు. అమరాపురంలో రోడ్డుపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. మడకశిరలో పంపిణీ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. పలు చోట్ల రైతులు, పోలీసులు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పామిడిలోనూ రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. కేంద్రాల్లో సరిపడా విత్తన నిల్వలు లేనందున ఈ పరిస్థితి నెలకొంది.
వేరుశెనగ విత్తనాల కోసం.. రైతుల ఆందోళనలు - వేరుశెనగ
అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాల కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విత్తన నిల్వలు నిండుకోవడం వల్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.