తుంగభద్ర ఎగువ కాలువ నీటి కేటాయింపుల్లో అనంతపురం జిల్లాకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. కనేకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... తుంగభద్ర రిజర్వాయర్‌కు పుష్కలంగా నీరు వచ్చినప్పటికీ... హెచ్ఎల్సీ కేటాయింపులు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు సకాలంలో నీటిని అందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కనేకల్ చెరువు కింద వరి సాగు చేసిన రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా హెచ్ఎల్సీకి నీళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.