ETV Bharat / state

పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేయించాలి: పరిటాల సునీత - paritala sunitha latest news

చిత్రావతి జలాశయ ముంపు గ్రామాల్లోని అర్హులందరికీ పునరావాస పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో అధికారులు ఇళ్ల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గాయపడిన బాధితులను ఆమె పరామర్శించారు.

Former Minister paritala sunitha
అర్హులకు పరిహారంపై మాట్లాడుతున్న పరిటాల సునీత
author img

By

Published : Oct 31, 2020, 7:36 AM IST

చిత్రావతి జలాశయ ముంపు ప్రాంతమయిన అనంతపురం జిల్లా మర్రిమాకులపల్లిలో అధికారులు ఇళ్ల తొలగింపు చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో ఇల్లు కూల్చివేస్తుండగా ఐదేళ్ల బాలుడు నాగచైతన్య, పార్వతమ్మ అనే మహిళ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. వారికి రూ.15,000 ఆర్థిక సాయం అందించారు.

ముంపు గ్రామాల్లోని అర్హులందరికీ పరిహారం ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించాలని సునీత డిమాండ్​ చేశారు. కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో లేవని, వారి పరిహారానికి సంబంధించి ఆర్డీవోతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ సమస్యపై గ్రామస్థులతో వెళ్లి కలెక్టర్​ను కలవనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పోలవరం నిధుల్లో మరింత కోత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.