Kalva Srinivas Comments on YCP: కర్నూలులో వైసీపీ నిర్వహించింది రాయలసీమ విద్రోహ సభ అని.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ నాయకులు సీమ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని చేశారు. వైసీపీ క్షీణదశకు గర్జన సభ వైఫల్యమే నిదర్శనమని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తరలించి, జనం లేక మధ్యాహ్నానికే సభను ముగించాల్సి వచ్చిందన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీలో న్యాయ విభాగాన్ని ఒకవైపు మూసేస్తూ.. ఇంకోవైపు రాలయసీమకు న్యాయ రాజధాని తెస్తామంటే ఎలా నమ్మాలని నిలదీశారు. ఈనెల 13 నుంచి రాయలసీమ ప్రాజెక్టులు సందర్శిస్తామన్న కాలవ.. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే వాటిని పూర్తి చేయాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: