అనంతపురం జిల్లా ధర్మవరంలో జాతీయ నాయకుల విగ్రహాలకు అడ్డుగా వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి అడ్డుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన పోలీసులు.. అబ్దుల్ కలాం విగ్రహానికి అడ్డుగా ఉన్న వైకాపా నాయకుల ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించారు.
ఇదీ చదవండి: