అనంతపురం జిల్లా హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపట్టారు. బెట్టింగ్ రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి లక్ష రూపాయల నగదు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి వారి నడవడికలను తెలుసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే ఎంతటి వారినైనా అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: