అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటలో జులై 15వ తేదీన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ సత్య ఏసుబాబు.. హత్య ఉదంతాన్ని, అందుకు కారణాలను వివరించారు. శివలింగంలో వజ్రాల కోసం రెక్కీ నిర్వహించిన నిందితులు.. తమ దోపిడీకి అడ్డుపడుతారనే ఉద్దేశంతోనే ముగ్గురు వ్యక్తులను హత్య చేశారని తెలిపారు. జంతువుల రక్తాన్ని రెండు సీసాల్లో తీసుకొచ్చి సమీపంలోని పాముల పుట్టలో కొంత, శివలింగంపై మరికొంచెం పోశారని చెప్పారు. అనంతరం ఆలయం లోపలికి వెళ్లి శివలింగం ఆకారాన్ని చూసి.. లింగంలో వజ్రాలు లేవని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు. నిందితులకు పురాతన ఆలయాల వివరాలను, గుప్త నిధులను చెప్పడంలో హనుమంతనాయక్, శ్రీనివాసులు కీలకమైన వ్యక్తులని ఎస్పీ తెలిపారు. మరో కీలకమైన నిందితుడు శ్రీనివాసులు కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: