అనంతపురం జిల్లాలోని పీటీసీ మైదానంలో 108 మంది నర్తకులు, 108 మంది గాయకులతో సంగీత నృత్య మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంధ్య మూర్తి నృత్య శిక్షణాలయం ఆధ్వర్యంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం సంగీత నృత్య మహోత్సవం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గాయకుల సంగీత ఆలాపన వీనులకు విందు చేస్తే.. నర్తకీల నృత్యాలు కనువిందు చేశాయి. దీనికి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.
ఇవీ చూడండి...