అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిద్య ప్రవేశాలకు మొదటి రోజు కౌన్సెలింగ్ ఇవాళ ముగిసింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యార్థులు హాజరైనట్లు వీసి రామకృష్ణారెడ్డి తెలిపారు. 1 నుంచి 2,500 ర్యాంకు వరకు ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. మూడు రోజులపాటు కౌన్సెలింగ్ జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని.. సమయం వృథా చేయకుండా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి: