అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలోని వి.అగ్రహారం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నరసింహమూర్తి అనే రైతు మల్బరీ షెడ్డుకు ఏర్పాటు చేసిన విద్యుత్ సర్వీసు వైరుకు మంటలు చెలరేగి షెడ్డు మొత్తం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో షెడ్లో ఉన్న వ్యవసాయ సామగ్రి, ఎరువులు, బియ్యం, రాగులు, జొన్నలు, వేరుశనగ విత్తనాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. సుమారు రూ.2 లక్షలు వరకు పంట నష్టం వాటిల్లింది. విత్తేందుకు సిద్ధంగా ఉంచిన విత్తనాలు అగ్నికి ఆహుతవ్వడంతో, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి:కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి