ETV Bharat / state

Pushed Out of Moving Train: గొడవ వద్దని సర్దిచెప్పినందుకు.. రైలు నుంచి తోసేశాడు

author img

By

Published : Jun 16, 2023, 11:35 AM IST

Pushed Out of Moving Train: రైలులో సీటు కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బయటకు తోసేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. అసలు ఏం జరిగిందంటే..?

Pushed Out of Moving Train
కదులుతున్న రైలు నుండి బయటకు తోసేశారు

Pushed Out of Moving Train: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రైలు సీట్ కోసం ఘర్షణ పడుతున్న వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ట్రైన్​లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కుమ్మవారిపల్లికి చెందిన రమేశ్‌కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. రైలులో హైదరాబాద్‌కు వెళ్తుండగా అనంతపురం రైల్వేస్టేషన్ దాటాక.. తోటి ప్రయాణికులు సీటు కోసం ఇద్దరు గొడవ పడుతుండగా.. రమేశ్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు గొడవ పడుతున్నారని.. తర్వాత స్టేషన్​లో సీటు ఖాళీ అయితే కూర్చోవచ్చని చెప్పాడు.

ఆ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని.. రమేశ్ తెలిపారు. వారికి సర్దిచెప్పాక రైలు డోర్ వద్ద కూర్చున్నానని రమేష్ తెలిపాడు. తర్వాత కొద్ది సేపటికి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను కాలితో తన్ని తోసేసినట్లు రమేశ్ చెప్పారు. రైలు నుంచి కిందపడ్డ రమేశ్‌ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. సుమారు గంటపాటు ముళ్లపొదల్లో పడి ఉన్నట్లు రమేశ్‌ చెప్పారు. తర్వాత అంబులెన్స్‌కు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వగా వారు రమేశ్‌ను గుత్తి ఆసుపత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించారు. ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Petrol Attack: బాపట్లలో దారుణం.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్​ పోసి నిప్పు

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు.. నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమం: ద్విచక్ర వాహనాన్ని.. టాటా ఏస్ వాహనం ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఓ బాలిక సహా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పీసీపల్లి మండలం బుడ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహారెడ్డిని, నాలుగేళ్ల బాలికను.. హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు కనిగిరి ఆర్టీసీ డిపో వద్దకు బంధువులు ఆదినారాయణరెడ్డి, మహేందర్​రెడ్డిలు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. నలుగురూ ఒకే వాహనంపై వెళ్తుండగా.. కనిగిరి నుంచి కందుకూరువైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పలువురు యువకులు టాటా ఏస్ వాహనాన్ని వెంబడించినప్పటికీ.. ఆపకుండా వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Gay Murder Case: గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యి.. ప్రాణం తీశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.