విడపనకల్ లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో.. వైకాపా నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. వేదికపైనే వర్గాలుగా విడిపోయిన నేతలు.. బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన విడపనకల్ మాజీ ఎంపీపీ రమణారెడ్డి వేదికపైకి రావడాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వ్యతిరేకించారు.
అదే.. వాగ్వాదానికి, ఘర్షణకు కారణమైంది. ఇంతలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనయుడు భీమిరెడ్డి కలగజేసుకొని తమ వర్గానికి చెందిన కార్యకర్తలకు సర్ధి చెప్పారు. ప్రతి ఒక్కరు సభ సంప్రదాయాలు పాటించాలని కోరారు. తాము ఎప్పుడూ తెదేపాకు ఓటు వేయాలని ఏ ఒక్కరికీ చెప్పలేదని భీమిరెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: