ETV Bharat / state

MURDER ATTEMPT IN ANANTAPUR : కన్నతండ్రి కర్కశత్వం...వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడని పైశాచికత్వం - crime news in anantapur

Murder attempt in Anantapur : అనంతపురంలో విషాదం నెలకొంది. కుమారుడిపై కిరోసిన్ పోసి ఓ తండ్రి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కన్నకొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తండ్రి

author img

By

Published : Dec 4, 2021, 3:41 AM IST

Murder attempt in Anantapur : అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న న్యాయవాది మహబూబ్ బాషాకు హుస్సేన్ అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని హుస్సేన్ ఇటీవల తండ్రితో గొడవపడ్డాడు. ఈ విషయమై బాషాను బంధువులు మందలించారు. ఆగ్రహించిన మహబూబ్ బాషా నిన్న సాయంత్రం నమాజ్ చేసుకుంటున్న కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాషాకూ గాయాలయ్యాయి. హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.