పంట రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు వచ్చిన రైతులతో.. అనంతపురం జిల్లా ధర్మవరం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంగణం రద్దీగా మారింది. కరోనా తీవ్రత ఎక్కువవుతున్న సమయంలో అధిక సంఖ్యలో రైతులు రావడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని బ్యాంకు అధికారులతో మాట్లాడారు.
రోజుకు వంద మందికి మాత్రమే టోకెన్లు ఇస్తామని బ్యాంకు అధికారి స్పష్టం చేశారు. ఈ విషయంపై.. ధర్మవరం గ్రామీణ ఎస్సై ప్రదీప్ కుమార్ రైతులకు నచ్చజెప్పి వెనక్కి పంపారు. టోకెన్లు అందిన వారు మాత్రం బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకున్నారు.
ఇదీ చదవండి: