పంట నష్టపరిహారం జాబితా తయారు చేసే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ రైతులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం. కొత్తూరు గ్రామ సచివాలయంలో సిబ్బంది నిర్లక్ష్యంతో వందలాది మంది రైతులు పంట నష్ట పరిహారం కోల్పోయామని ఇప్పటికే కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. వందలాది మంది రైతులు వేరుశనగ పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయినా ఇంత వరకు పరిహారం అందించలేదన్న ఆగ్రహంతో రైతులు పాపంపల్లి ప్రధాన రోడ్డుపై నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న ఉద్దేశంతో పుత్తూరు పంచాయతీలోని పలువురు రైతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కళ్యాణ్ దుర్గం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి