ETV Bharat / state

పరిహారం చెల్లింపులో అవకతవకలు... రైతుల ఆందోళన - అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా ఏడావులపర్తి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసే క్రమంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు పేర్కొన్నారు.

farmers protest due to fraud in e-crop booking
పరిహారం చెల్లింపులో అవకతవకలు... రైతుల ఆందోళన
author img

By

Published : Nov 23, 2020, 8:01 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం ఏడవులపర్తి గ్రామంలో పంట నష్టపరిహారం చెల్లింపులో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. వేరుశనగ ఈ- క్రాప్ బుకింగ్ చేయడంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటల నష్టపరిహారం అందేలా చూడాలని కర్షకులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన కందులు వేస్తే పూత కూడా రాలేదు. వ్యవసాయ అధికారికి చెప్పినా ఎలాంటి స్పందన లేదు. రైతులు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నా అధికారుల పట్టించుకోవట్లేదు. అకాల వర్షానికి వేరుశనగ పంట పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా కుళ్లిపోయింది. ఫలితంగా మేము తీవ్రంగా నష్టపోయాం -రైతులు

ఇదీ చదవండి:

నివర్​తో ఒక్కసారిగా పెరిగిన వరి కోత ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.