ETV Bharat / state

'వైకాపా అరాచకాలు ఎండగట్టేందుకే ఎన్నికల బహిష్కరణ' - kalava Srinivas latest news

వైకాపా చేస్తున్న అవినీతి, అరాచక పాలనను ఎండగట్టాలని ఉద్దేశంతోనే పరిషత్​ ఎన్నికలను పార్టీ అధినేత చంద్రబాబు బహిష్కరించారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనబోరని స్పష్టం చేశారు.

kalava srinivas fire on ycp
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Apr 4, 2021, 5:14 PM IST

ఎన్నికల్లో వైకాపా సృష్టిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే పరిషత్ ఎన్నికల్లో తెదేపా పాల్గొనట్లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న సంక్షోభాన్ని ప్రజలు గమనించాలన్నారు.

వైకాపా ప్రలోభాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచక పాలనను ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ అధినేత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెదేపా పాల్గొంటే అరాచక పాలనలో తాము భాగస్వామ్యం ఐనట్లేనని.. ఆ కారణంగా ఎన్నికల్లో తమ కార్యకర్తలు, నాయకులు ఎవరూ పాల్గొనరని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

తహసీల్దార్‌ నిర్వాకం.. ప్రభుత్వ భూములకు జిరాయితీ పట్టాలు.. వంద ఎకరాలు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.