ప్రభుత్వం ప్రకటించిన విధంగా వ్యవసాయానికి పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలంటూ అనంతపురం జిల్లా కదిరి లోని విద్యుత్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. కదిరి మండలం కె. బ్రాహ్మణపల్లి, ఎగువపల్లి పంచాయితీ పరిధిలోని గ్రామాలకు 3 వారాల నుంచి రాత్రి వేళలో విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు వాపోయారు. సేద్యం పనులకు కూలీలు దొరకడమే కష్టమవుతుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా చేస్తే నాట్లు ఎలా వేసుకోవాలని రైతులు సిబ్బందిని నిలదీశారు. పగటి పూటే విద్యుత్ ఇవ్వాలని కోరుతూ స్థానికి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి భద్రమ్మ తల్లి సన్నిధిలో సభాపతి సీతారాం