అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో బ్యాంకు అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకులో ప్రతి ఏటా రైతులతో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలను రెన్యువల్ చేసేవారు. అయితే ఈసారి ఆ బ్యాంకు కెనరా బ్యాంక్ లో విలీనం అయిన కారణంగా... నిబంధనలు మారాయి.
అసలు, వడ్డీ మొత్తం కడితేనే రెన్యువల్ చేస్తామని అధికారులు రైతులకు తేల్చిచెప్పారు. రైతులు బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో కొంత మంది రైతులు బ్యాంకు అధికారులతో మధ్యవర్తిత్వం కొనసాగించినా సమస్య పరిష్కారం కాలేదు. బ్యాంకు సిబ్బంది మాత్రం తమ ఉన్నతాధికారులతో చర్చిస్తామని వచ్చే సోమవారం వరకు తమకు సమయం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: