అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పలు చెరువులు భారీ వర్షాలకు నిండి జలకళ సంతరించుకున్నాయి. కానీ చెరువులకు పడిన గండి వలన నీరు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు పోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు ఏ క్షణం ఉగ్రరూపం దాల్చుతాయోనని భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో ఉన్న చెరువులకు పడిన గండిని సంబంధిత అధికారులు పూడ్చి నీటిని నిల్వ ఉండేటట్లు చర్యలు తీసకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న పులికల్లు, రామసాగరం, గోల్డెన్ చెరువులకు పడిన గండ్లు త్వరగా పూడ్చివేసేటట్లు చర్యులు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి : యాడికి జలదిగ్బంధం