అనంతపురం జిల్లా అమరాపురం మండలం వీ. అగ్రహారంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మరాజు అనే రైతు తన ఇంటి ఆవరణలోని మల్బరీ షెడ్డులో లుంగీతో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మరాజు తనకున్న 5 ఎకరాల భూమిలో బోరు వేయించేందుకు, పంట పెట్టుబడికి, అనారోగ్యంతో ఉన్న తన కుమారుడు వైద్య ఖర్చులకు బ్యాంకులో రూ. 8లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య తెలిపారు. అతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...
కరోనా పోరులో నెల్లూరు యువత... అండగా నిలుస్తూ నలుగురికి ఆదర్శం