అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలో అధికారులు మరోసారి పట్టాల పంపిణీ వాయిదా వేశారు. పట్టాల పంపిణీని తరచూ వాయిదా వేయడం భావ్యం కాదంటూ వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే శివరాంరెడ్డి వర్గీయులు భారీ ప్రదర్శన చేపట్టారు.. పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు కావడంతో లబ్ధిదారులు నిరాశతో వెనుదిరిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకే పట్టాల పంపిణీ వాయిదా వేసినట్లు తెలిపారు.
పట్టాల పంపిణీ చేస్తారని వచ్చాం. హఠాత్తుగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిసింది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. కానీ అది అందని ద్రాక్షలానే మిగిలి పోతోంది. - లబ్ధిదారులు
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వైకాపా నేతలు చెబుతున్నారు. ఇంటి పట్టాల పంపిణీ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఇదీ చదవండి: అనంతపురంలో రహదారి భద్రత మాసోత్సవాలు