సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో సాధారణ వ్యక్తిలా జీవనం గడుపుతున్నారు. రఘువీరారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చిరకాల లక్ష్యం గ్రామంలో దేవాలయ నిర్మాణం. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు రఘువీరా దేవాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతి పనిని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మే 29న దేవాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు.
ఇదీ చదవండి: ఎంపీడీవో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు..!