అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం ఎదుట ఒప్పంద కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతునే ఉన్నాయి. పవర్ జేఏసీ పిలుపుమేరకు గత నెల 19 నుంచి కార్మికులు తమ నిరసనను తెలియాజేస్తున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్న భోజన సమయంలో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారి నేరుగా వేతనాలను అందజేయాలని, ఈపీఎఫ్ అమలు చేయాలని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపి సంస్థలో పనిచేసే కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా విద్యుత్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి