అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామ పరిసరాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కళ్యాణదుర్గం రూరల్ ఎస్సై సుధాకర్.. సిబ్బందితో దాడిచేసి 8 మందిని అరెస్టు చేశారు.
వారి నుంచి 14,160 రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు సహించేది లేదన్నారు.
ఇదీ చదవండి: