అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో గత 48 గంటల్లో 8 మంది కరోనా రోగులు మృతి చెందటం కలవరపాటుకు గురి చేస్తోంది. వైద్యుల సమాచారం మేరకు.. కరోనా రెండో దశ చికిత్స ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మెుత్తం 80 మంది రోగులు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రి సామర్థ్యం వంద పడకలు కాగా.. 84 పడకలకు ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉంది.
కదరి పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. తీవ్రతను బట్టి ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించాలని రాజకీయ పక్షాలతోపాటు వైరస్ బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకొని మరణాలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచదవండి