అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా లేపాక్షి తహసీల్దారు బలరాం నూతనంగా ఆలోచించారు. మండల కేంద్రంలో ఇళ్ల గేటుకు తాళం వేసి తాళం చెవి వారి చేతికే ఇస్తున్నారు. ఈ నెల 14వరకు ఎట్టి పరిస్థితిలో ఇళ్లనుంచి ఎవరూ బయటకు రాకుడదంటూ వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యావసర సరకులు, పాలు, కిరాణా వస్తువులు తీసుకోవడానికి... రోజూ అరగంటపాటు మినహయింపు ఇస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే తప్పా.. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ తెలియచేస్తున్నారు. ఇంటిగేటుకు తాళం వేసే కార్యక్రమం విజయవంతమైతే ఇదే తరహాలో మండలవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. దీనివల్ల అనవసరంగా బయటకు తిరగకుండా వందశాతం లాక్డౌన్ను విజయవంతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంతో కరోనా మహమ్మారి పారద్రోలగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనా వెతలు.. కుదేలైన పంటలు, పరిశ్రమలు