ETV Bharat / state

Water: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిలిచిన తాగునీటి సరఫరా... ఎందుకంటే?

Drinking water supply stopped: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వరదల కారణంగా మరమ్మతుల చేసేందుకు వీలుకాకపోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిలిచిన తాగునీటి సరఫరా

author img

By

Published : Sep 2, 2022, 2:05 PM IST

Drinking water supply stopped: కర్ణాటక రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం పీఏబీఆర్ ​డ్యాంకు 14 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా డ్యాం ఆరు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. నీరు విడుదల చేయడంతో డ్యామ్ నుంచి కళ్యాణదుర్గం నియోజవర్గానికి సరఫరా అయ్యే సత్యసాయి తాగునీటి పైపులైన్లు నీటి వేగానికి కొట్టుకుపోయాయి. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వరద తగ్గే వరకు పైపులైన్ల మరమ్మతులు చేసే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెన్నా నది ఒడ్డున రైతులు వేసుకున్న మోటార్లు కూడా నీటిలో మునిగిపోయాయి.

ఇవీ చచవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.