అనంతపురం జిల్లా ఉరవకొండలో పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల పైప్ లైన్ సమస్యలు, నీటి మోటర్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాగునీరు రాకపోవడంతో ఇంటి అవసరాల కోసం ప్రజలు ఉప్పునీటి ట్యాంకులు వద్ద క్యూ కట్టారు. మంచి నీరు కొందామంటే 600 వందల రూపాయలు అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాములుగా పీఏబీఆర్ జలాశయం, నింభగల్లు పంప్ హౌస్ నుంచి 32 లక్షల లీటర్ల నీరు రావాల్సి ఉండగా.. కేవలం 20 లక్షల లీటర్ల మాత్రమే వస్తున్నట్లు నీటి సరఫరా అధికారి తెలిపారు. కొన్ని చోట్ల మోటర్లు కాలిపోయి..కరెంట్ లేకపోవడం, నీరు లీకేజీ... వంటి సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. కొత్త మోటర్లకు ప్రతిపాదన పంపమని, అవి వస్తే నీటి సమస్య ఉండదని అన్నారు.
ఇదీ చదవండీ.. 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల