అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. దాదాపు 80 రోజుల తరువాత దేవాదాయశాఖ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా భక్తులు మాస్కులు, శానిటైజర్ వెంట తెచ్చుకోవటంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలను ఆలయ అధికారులు చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం దర్శనానికి అనుమతించారు. ఆరాధ్య దైవం నారసింహుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు దీరారు.
ఇదీ చదవండి