అనంతపురం జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ కార్యవర్గ సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారికి, అమృతవల్లి అమ్మవారికి న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విశిష్టతను అర్చకులు న్యాయమూర్తికి తెలియజేశారు. అనంతరం స్వామివారి జ్ఞాపికతోపాటు తీర్ధ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వదించారు.
ఇవీ చూడండి...