లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పేదలకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సరకులు పంపిణీ చేశారు.
కరోనాపై పోరు అందరి బాధ్యత అని..పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఇంటికే సరుకులను అందించామని తెలిపారు.
ఇదీ చూడండి: