Disabled Person Attempt to Suicide: అనంతపురం జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఉద్యోగం నుంచి తొలగించారని, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొడుతున్నారని బాధితుడు వాపోయ్యాడు. బాధితుని సోదరుడు పెద్దిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని బుక్కరాయసముద్రం సీఐ వేధిస్తున్నారంటూ మహానందిరెడ్డి అనే దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బొమ్మలాటపల్లికి చెందిన మహానందిరెడ్డి 2018లో యానిమేటర్‌గా విధులు నిర్వహించేవాడని అన్నారు. ప్రభుత్వం మారడంతో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. అయితే మహిళా సంఘాల సొమ్ము విషయంలో అతను అవకతవకలు చేశారని ఆరోపణలు వచ్చాయి. మహిళల సంఘాల వాళ్లు తన సోదరుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
అధికార పార్టీ ఆగడాలపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడినే బంధించిన పోలీసులు
అయితే 5 ఏళ్ల తర్వాత ఈ అంశాన్నితెరపైకి తెచ్చారని బాధితుని సోదరుడు పెద్దిరెడ్డి వివరించారు. కేసు విచారించడం మానేసి బుక్కరాయసముద్రం సీఐ నాగార్జున రెడ్డి విచారణ పేరుతో వారం రోజులుగా నిత్యం పోలీస్ స్టేషన్‌కి పిలిపించి తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. ఇటీవలే గ్రామంలోని సచివాలయం వద్ద దివ్యాంగులకు సంబంధించిన ఓ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో, సీఐ అక్కడికి వచ్చి తన సోదరుడ్ని సచివాలయం ముందే కొట్టినట్లు వివరించారు. రెండు లక్షలు ఇవ్వాలని లేకపోతే వదిలే ప్రసక్తే లేదని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Police Harassment in AP: ఈ నేపథ్యంలోనే మహానంద రెడ్డి తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించారు. పరిస్థితి విషమంగా మారడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను సీఐ తీవ్రంగా కొట్టారని దెబ్బలు చూపిస్తూ బాధితుడు కన్నీటి పర్వంతమయ్యాడు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
ఆర్మీ జవాన్‌పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి
"ఒకరోజు ఊర్లో సచివాలయం ముందే సీఐ నాగార్జున రెడ్డి మా అన్నను కొట్టాడు. తాజాగా సీఐ ఫోన్ చేసి డబ్బులు తీసుకువస్తానన్నావు ఎందుకు తేలేదని అడిగాడు. కారణం అడిగితే నువ్వు వాళ్లకు డబ్బులు కట్టలేదని అన్నాడు. మరోసారి అడిగితే నువ్వు డబ్బులు తీసుకురా తర్వాత కారణం చెప్తా అన్నాడు. డబ్బులు తీసుకురాకపోతే సీఐ ఇంటికి వస్తానని అనడంతోనే మా అన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఐ మా అన్నను వరుసగా మూడు రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు. రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడానికి మరో యువకుడు వెళ్తే, అతనితో డబ్బులకు వీలునామా రాయమని అడిగాడు" -పెద్దిరెడ్డి, బాధితుడి సోదరుడు
'చేయని నేరం ఒప్పుకోమన్నారని' - పోలీస్ స్టేషన్ బాత్రూంలో ఫినాయిల్ తాగిన యువకుడు