ETV Bharat / state

కార్మికుల నిరసన.. గ్రామాల్లో తాగునీటి కష్టాలు - sri ramireddy driking water project workers issue in annatapur dst

తమ సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లాలోని శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు విధులను బహిష్కరించి నిరసన చేశారు. ఫలితంగా ప్రాజెక్టుపైనే ఆధారపడిన మడకశిర నియోజకవర్గంతో పాటు ఐదు నియోజకవర్గాల ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడింది.

drking waer problem in anantapur dst five consistencies due to protest of  project labors

author img

By

Published : Jul 20, 2020, 6:58 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తొమ్మిది వందల గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఐదు రోజుల నుంచి సమ్మెకు వెళ్లటంతో మడకశిర నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.

కార్మికుల సమస్యలు పరిష్కరించి గ్రామాల్లో నీటిని అందించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం ప్రాజెక్టులో 700 మంది కార్మికులకు మూడు నెలల బకాయిలు చెల్లించి, పిఎఫ్ ద్వారా రావాల్సిన డబ్బులు తమకు అందించేవరకు సమ్మెను కొనసాగిస్తూ దశలవారీగా ఉద్ధృతం చేస్తామని కార్మికులు తెలిపారు.

ఇదీ చూడండి

దేశంలో వర్షాలు అధికంగానే కురుస్తున్నాయ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.