అక్రమణకు గురైన అటవీభూములకై అనంతపురం డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమించిన 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అటవీ భూముల ఆక్రమణలను గుర్తించటానికి ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నామని.. ఇప్పటికే 120 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలిందన్నారు. అటవీ భూములు సాగుచేస్తున్న వారు 90 మంది వరకు ఉన్నారని, మరో నాలుగు రోజులు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని డీఎఫ్ఓ తెలిపారు. ఆక్రమణల నుంచి భూములు వెనక్కు తీసుకున్న తరువాత వాటిలో కాంటూరు కందకాలు, నీటి కుంటలు తవ్వుతున్నట్లు జగన్నాథ్ సింగ్ చెప్పారు.
ఇదీచూడండి.చదువు ఒత్తిడి, అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య