అనంతపురం జిల్లా తురకపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేరీ జోష్న డిగ్రీ మెుదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఆమె మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మెుదట కాలుజారి కిందపడి చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తలపై గాయం..మెడను తాడుతో బిగించినట్లు ఆనవాళ్లు లభించటంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి