అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోతిగుట్టలో నివాసముంటున్న దామోదర్ (43) అనే గార్మెంట్స్ కార్మికుడు అప్పుల బాధ తాళలేక షాపులో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దామోదర్ కుట్టుమిషన్లు పెట్టుకొని పీస్ వర్క్ కింద తాను సొంతంగా కుడుతూ.. కార్మికులను పెట్టుకుని జీన్స్ ప్యాంట్లు తయారు చేసేవాడు.
కరోనా లాక్డౌన్ సమయంలో గార్మెంట్ తయారీ మూతపడటంతో.. దుకాణం అద్దెలు, కార్మికులకు జీతాలు చెల్లించటానికి బయట అప్పులు చేశాడు. గార్మెంట్స్ వ్యాపారం కోసం, కూలీల చెల్లింపుల కోసం దాదాపు రూ.5 లక్షల దాకా అప్పు చేసినట్టు తెలిపారు. అప్పులు చెల్లించాలని వ్యాపారులు, దళారులు ఇంటికి రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మద్దలపల్లి సమీపంలో స్కార్పియో బోల్తా.. ఇద్దరికి గాయాలు