అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దళితులు ఆందోళకు దిగారు. అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ కులాలు తమపై దాడి చేశారంటూ ఆరోపించారు. గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి పలువురు కూలీ పనులు కోసం వెళ్లారు.
అక్కడ మొబైల్ పొయిందని ఆరోపిస్తూ....పనులకు వెళ్లిన వారిని పిలిచి వారిపై ప్రసాద్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చెన్నంపల్లి భాస్కర్‌రెడ్డి కలిసి నిర్దాక్ష్యంగా దాడి చేశారంటూ ఇంద్ర, చంద్రశేఖర్, నాగేంద్రలు ఆరోపించారు. వారి కుటుంబసభ్యులతో సహా రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయ చేయాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి