Cyber fraud: అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి... సైబర్ నేరగాళ్ల మాయలో పడి దాదాపు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీషోలో మీకు కారు బహుమతిగా వచ్చిందంటూ మాటలు కలిపి డబ్బులు చెల్లించాలని గుర్తు తెలియని వక్తులు ఫోన్ చేశారు. ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి దాదాపు రూ.15 లక్షలను బాధితుడి నుంచి తీసుకున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు ఆఫర్లో బహుమతులు తగిలాయని వస్తున్న అపరిచిత కాల్స్‌కు ఆశ పడి డబ్బులు పోగొట్టుకూడదని ఎస్ఐ హెచ్చరించారు. అపరిచితులు కాల్స్ వస్తే వెంటనే 1930 నెంబరుకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా లోన్ యాప్‌ల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: