అనంతపురం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. బొమ్మణహల్ మండలం, గోవిందవాడ గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట పూర్తిస్థాయిలో మునిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రావాల్సిన సమయంలో నీటి పాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి సాగు చేస్తున్నామని వర్షం తీవ్ర నష్టాలను మిగిల్చిందంటూ రైతులు వాపోయారు. నీటమునిగిన పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .
ఇదీ చూడండి. పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నారు... కటకటాలపాలయ్యారు